బాపట్ల కలెక్టర్‌, ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

బాపట్ల కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల్లో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారిని, జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐ.పీ.ఎస్ గారిని ఆయన కలిసి అభివాదం చేశారు.

సమావేశంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి, శాంతిభద్రతలు (లా అండ్ ఆర్డర్)తో పాటు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మాలకొండయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కలెక్టర్‌, ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe