సమాజాభివృద్ధిలో యువతే కీలకం – యువజన దినోత్సవంలో జె.సి. రాజు

సమాజాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని రోటరీ జిల్లా అధ్యక్షులు, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె.సి. రాజు అన్నారు. మంగళవారం రాత్రి ఎం. బూర్జివలస గ్రామంలో డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె.సి. రాజు మాట్లాడుతూ, ఎం. బూర్జివలస గ్రామ యువత చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. యువత కృషితో గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ గ్రంథాలయానికి కారుణ్య ఫౌండేషన్ తరఫున రూ.22 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను జె.సి. రాజు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, సర్పంచ్ ఈశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ రౌతు రామమూర్తి నాయుడు, యూత్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు, సభ్యులు చంద్రినాయుడు, రమేష్, గణేష్, రామ్మూర్తి, జి.హెచ్.జి. శర్మ తదితరులు జె.సి. రాజును ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు.

WhatsApp Join Now
Youtube Subscribe