విశాఖపట్నంలో రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ఎన్‌ఏడీ జాతీయ రహదారిపై చేపట్టిన ఈ తనిఖీల్లో ప్రయాణికుల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్న వాహనాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రైవేట్, కాంట్రాక్ట్ బస్సుల్లో నిబంధనల అమలు తీరును పరిశీలించారు. తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్ నిబంధనల ఉల్లంఘన, అధిక ప్రయాణికుల రవాణా వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని మొత్తం 8 బస్సులపై కేసులు నమోదు చేశారు. రహదారులపై ప్రమాదాలు తగ్గించేందుకు ఇటువంటి స్పెషల్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల ప్రాణభద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, వాహన యజమానులు తప్పనిసరిగా అన్ని నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖలో ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్ – ఎన్‌ఏడీ జాతీయ రహదారిపై బస్సులపై కఠిన తనిఖీలు
13
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
