ముగ్గుల పోటీలతో మిన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణంలోని పగడాలపల్లి వీధిలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. బీజేపీ మహిళా నాయకురాలు కుప్పాలా జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను నిర్వహించగా, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. తెలుగువారి సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా రంగురంగుల రంగవల్లులతో వీధి అంతా కళకళలాడింది. విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులతో వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కుప్పాలా జ్యోతి మాట్లాడుతూ, మన సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బ్రహ్మకుమారి, రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి నేత మల్లెం హేమంత్ కుమార్, అంకిపల్లి భువనేశ్వర్, సాయం శ్రీధర్, డాక్టర్ పద్మ విజయ తదితరులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. స్థానిక ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ వేడుకలు నిజంగా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

WhatsApp Join Now
Youtube Subscribe