పెద్దపల్లిలో ఆస్తి కోసం పెంపుడు కొడుకు చేతిలో తల్లి హత్య

పెద్దపల్లి జిల్లా నీరుకుల్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం పెంపుడు కొడుకు తన తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాయి ముందుగా మద్యం తాగించి, అనంతరం గొంతు నులిమి తల్లిని హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe