చిట్వేలి జనవరి 12 ఎల్లో సింగం ప్రతినిధి
చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ వన్‌ను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, “క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను మంచి దిశలో నడిపించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి” అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన, టోర్నమెంట్ ద్వారా గ్రామాల మధ్య స్నేహభావం మరింత పెరుగుతుందని, యువత ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక యువ నాయకులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొని టోర్నమెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
