బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం మండలం చినబొండపల్లిలో రైతులుకు పశు పెంపకం దారులకు పశు దాన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. పాల అధిక దిగుబడికి పశుదానా ఎంతగానో దోహదపడుతుందని, పెంపకం దారులకు దానిని తక్కువ ధరకు అందించి చేయూతగా ప్రభుత్వం నిలబడుతుందని అన్నారు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతే రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎమ్మెల్యే వివరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందజేసిన దానాలు అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
