వివేకానందకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర….

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సోమవారం ఆయన కు ఘన నివాళులర్పించారు. జాతీయ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవస్థ మారాలంటే ముందు నువ్వు మారాలన్న సిద్ధాంతంతో యువతను చైతన్యవంతం చేసిన మహామనిషి వివేకానంద అని కొనియాడారు. రామకృష్ణ మఠం స్థాపించి యువతలో చైతన్యం పెంచడంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించి భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించారని కొనియాడారు. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు వివేకానంద గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటాయని పేర్కొన్నారు. వివేకానంద గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవం గా ప్రతి ఏటా జరుపుతూ ఉంటుందని వెల్లడించారు. వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ సాధ్యమైనంత వరకు సమాజానికి సేవ చేయాలని నేటి యువతకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe