కారుణ్య ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ..వివిధ గ్రామాల పేదలకు 300 దుప్పట్లు పంపిణీ

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

సామాజిక సేవాకార్యక్రమాలకు ముందు వరుసలో ఉండే కారుణ్య ఫౌండేషన్ సామాజిక బాధ్యతగా మరో సామాజిక సేవాకార్యక్రమానికి ముందుకు వచ్చిందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె రాజు తెలిపారు. విపరీతమైన చలితో గ్రామీణ ప్రాంత పేదప్రజలు బాధపడటంతో వివిధ గ్రామలనుండి ఆ గ్రామ యువత పేదలకు దుప్పట్లు సమకూర్చవలసినదిగా విజ్ఞప్తి చేశారు .అందుకు కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు స్పందించి 72 వేల రూపాయల విలువైన దుప్పట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం కారుణ్య ఫౌండేషన్ ఆవరణంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా బాడంగి మండలం వాడడ కు చెందిన యువత కు వారి అభ్యర్ధన మేరకు గ్రామంలో పేదలకు పంపిణీ చేయు నిమిత్తం 50 దుప్పట్లను రాంబాబు, కార్తిక్, సీతం నాయుడు లకు అందించారు.అలాగే రామభద్రపురం మండలం నాయుడువలస ఎస్ సి ఎస్ టి కాలనీ,ఎనుబరువు, బొబ్బిలి మండలం లోగిరిజన గ్రామాలైన రామందొరవలస,మోసురువలస,చిలకమ్మ వలస ,డొంకురు వలస గ్రామాలకు దుప్పట్లను సంక్రాంతి లోగా పంపిణీ చేస్తున్నట్లు జె సి రాజు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో కారుణ్య సభ్యులు డేవిడ్ జె విక్టర్ కె రామకృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe