బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
పార్వతీపురం పట్టణంలోని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సతీమణి అనూష ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు పతంగుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ పోటీలలో మహిళలు, బాలబాలికలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియా మిత్రులు, యువతులు, మహిళలు , నాయకులు, కార్యకర్తలు కుర్చీలాటలో కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి..
WhatsApp
Join Now
Youtube
Subscribe
