15వ తారీఖున ప్రారంభానికి సిద్ధమవుతున్న క్యాంటీన్

అన్న క్యాంటీన్ అందుబాటులోకి వస్తే దినసరి కూలీల కు మేలు జరుగుతుందన్న స్థానికులు

శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి :- శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ పనులు సరవేగంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రతి పేదవాడికి అందుబాటు ధరలో పట్టెడన్నం పెట్టాలని ఉద్దేశంతో ఎన్నికల ముగిసిన అనంతరం పున ప్రారంభించిన అన్న క్యాంటీన్ కొత్తవలస మండల కేంద్రంలో ప్రారంభానికి సిద్ధమవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు శృంగవరపుకోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి 2014 2019 మధ్య మాజీ శాసన సభ్యురాలుగా ఉన్న ఎస్ కోట మండల కేంద్రంలో తన సొంత నిధులతో నిరంతరాయంగా సుమారు 300 రోజుల వరకు అన్నా క్యాంటీన్ నడిపించారని వివిధ కార్యక్రమాలపై మండల కేంద్రాలకు వచ్చే వారికి ఈ అన్న క్యాంటీన్ లు ఎంతగానో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు

WhatsApp Join Now
Youtube Subscribe