వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్‌

నల్గొండ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో ఈ నిందితులు ఇతర దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి, ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. తాళం వేసి ఉన్న ఇండ్లు, కంపెనీలు, దుకాణాలనే టార్గెట్‌గా చేసుకుని పక్కా ప్లాన్‌తో చోరీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా ప్రాంతాన్ని రెక్కీ చేసి, ఎవరు లేని సమయాల్లో దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు.

ఇటీవల నల్గొండతో పాటు పరిసర జిల్లాల్లో జరిగిన పలు చోరీల కేసుల్లో ఇదే ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారి నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఇంట్లు తాళం వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe