మచిలీపట్నం, జనవరి 10 : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ కాలేఖాన్ పేటలో జనసేన నాయకులు కరింశెట్టి త్రినాథ్ నివాస గృహ ప్రాంగణంలో డివిజన్ ఇంచార్జ్ ఏరువ హేమశ్రీ, కూనపరెడ్డి సురేష్ ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ తేనేటి విందు సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ
పాల్గొని జనసేన పార్టీకి సహకారం అందించి సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చిన పలువురు జనసేన పార్టీ అభిమానులకు పార్టీ కండువాలను కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్రియాశీలకంగా జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించి జనసేన పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, కూటమి ప్రభుత్వ పాలన పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో వచ్చేవారిని స్వాగతిస్తామని
తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందెల ప్రణాళికలు రూపొందించిం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీనఅందించడం, మహిళలకొరకు ఉచిత బస్సు, ప్రయాణం, తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ అందించడం, సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ను పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తూ గ్రామాలన్నీ మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నారని, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ముందుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, క్లస్టర్ ఇంచార్జ్ కొండా మేస్త్రి, డివిజన్ ఇన్చార్జిలు ఉడుముల బుజ్జి, గుణ్ణంవాసు, ఏరువశ్రీనివాస్, రాఘవేంద్ర, బీ రంసుదర్శన్, వడ్డి చిరంజీవి, చలమలశెట్టి రమేష్, చింతల వంశి, హనుమకొండ సాయి, కొండవీటి ప్రభాకర్ పలువురు జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
