పమిడిముక్కల, జనవరి 10 : పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామంలో లింగమనేని బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకలో కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షులు
దండమూడి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండమూడి చౌదరి మాట్లాడుతూ…, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే ఇటువంటి పోటీల ప్రధాన ఉద్దేశమని, యువత క్రీడల్లో రాణించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నాయకత్వంలో యువత సంక్షేమానికి, క్రీడల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, శ్రీమతి వర్ల విశ్రమ కుమార్ రాజా (పామర్రు ఎమ్మెల్యే సతీమణి), మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్, లింగమనేని రామలింగేశ్వరరావు మరియు కూటమి నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
గడ్డిపాడు ఉత్సాహంగా ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్
11
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
