బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
పార్వతీపురంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సూర్యపీఠంలో ఈనెల 23,24,25 తేదీలలో జరగనున్న వార్షికోత్సవం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదివారం ఆవిష్కరించారు. పీఠం ఆవరణ లో పీఠాధిపతి నరహరి శాస్త్రి తదితరుల సమక్షంలో ఎమ్మెల్యే బోనెల మాట్లాడుతూ పార్వతీపురం పట్టణాన్ని ఇతర ప్రాంతాలకు ఉన్నతంగా పరిచయం చేయడం తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నారు.ఈ క్రమంలో సూర్యపీఠంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు సూర్య దేవుని దర్శనానికి అటు కోణార్క్, ఇటు శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు పార్వతీపురం లోనే సూర్యపీఠం అందుబాటులోకి రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మతాలకు కులాలకు అతీతమైన దేవుడు ఒక్క సూర్యభగవానుడు మాత్రమేనని, ఆధ్యాత్మికంగానూ సైన్స్ పరంగాను సూర్యునికి ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. సూర్యపీఠం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఈ విషయంలో ఎప్పుడైనా తనను కలవవచ్చునని ఎమ్మెల్యే విజయ్ చంద్ర నిర్వాహకులకు సూచించారు.
