వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరపడం

అభినందనీయం: జనసేన నేత ఆనాల సునీల్ కుమార్

  • కేకే వడ్డేపల్లిలో స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహావిష్కరణలో జనసేన యువ నాయకుల భాగస్వామ్యం
  • చల్లా జయకర్ పిలుపు మేరకు హాజరైన ఆనాల సునీల్ కుమార్

చిట్వేలు, జనవరి 11: ఎల్లో సింగం ప్రతినిధి

భారత స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో అభినందనీయమని జనసేన యువ నాయకులు ఆనాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం చిట్వేలు మండలం కేకే వడ్డేపల్లి మూల రోడ్డు సర్కిల్‌లో జరిగిన వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

-ఉయ్యాలవాడ ఆప్తమిత్రుడు.. బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నం

జనసేన నాయకుడు చల్లా జయకర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ఆనాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆప్తమిత్రుడుగా, సహచరుడుగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వడ్డే ఓబన్న త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అటువంటి మహనీయుడి జయంతిని అధికారికంగా జరపడం ద్వారా ఆయనకు ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో అర్థమవుతోందని ఆయన తెలియజేశారు.

-జనసేన తరపున నివాళులు

వడ్డే ఓబన్న గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సంక్షేమం కోసం జనసేన ఎప్పుడూ కృషి చేస్తుందని ఆనాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు పగడాల శివకుమార్తో పాటు పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe