గన్నవరం, జనవరి 10 :
భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది మన దేశంలో జరుపుకునే పండగలే అని నవభారత్ హై స్కూల్ కరస్పాండెంట్ షేకిమామ్ శనివారం నాడు నవభారత్ హై స్కూల్ నందు జరిగిన సంక్రాంతి సంబరాలు నందు పాల్గొంటు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల లో చదివే విద్యార్థిని విద్యార్థుల తల్లులకు పలు పోటీలను నిర్వహించారు
. ముందుగా ఉదయం ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం మరో మూడు రకాల పోటీలను మహిళలకు నిర్వహించడం జరిగింది.
అనంతరం పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రధమ ద్వితీయ తృతీయ, కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు సేకరించిన బొమ్మలతో బొమ్మల కొలువును చక్కగా అలంకరించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంప్రదాయక దుస్తులు ధరించి భోగిమంటల చుట్టూ ఆడి పాడారు. అనంతరం గాలిపటాలను ఎగరవేశారు. హరిదాసు వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది పాఠశాల ప్రధానోపాధ్యాయిని షేక్ జాకిర సుల్తానా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
