స్పందించని సర్పంచ్లు పంచాయితీ సెక్రెటరీలు

**1వ తేదీ పింఛలు పంపిణి ఒక్కటే బాధ్యతా.?

కృష్ణుడుపాలెంలో పునరావాస కాలనీ నిర్మించటమే నిర్వశితులకు శాపమా..?..

దేవీపట్నం మండల జనసేన అధ్యక్షులు చారపు వెంకటరాయుడు

దేవీపట్నం జనవరి 10 (ఎల్లో సింగం ప్రతినిధి):2019 వైసీపీ ప్రభుత్వం నుంచి 2026 కూటమి ప్రభుత్వం వరకు కనిపించని పంచాయితీ సెక్రటరీ లు సర్పంచులు పారిశుద్యం. గిరిజన గిరిజనేతరులుగా విభజించి పునరావాసన్ని కట్టారే తప్ప పంచాయితీ నిధులు చెల్లవని ఏ జీవో ఇవ్వలేదు అలాంటప్పుడు ఎందుకీ వెసులుబాటు ప్రజలను ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యటం.
కాలనీ లో గల బి మరియు సి బ్లాక్ 11వరోడ్డు నుండి 5వరోడ్డు వరకు గత 30రోజుల నుండి పంచాయితీ నీరు రావడం లేదు.నీరు లేక ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్యను అధికారి పట్టించుకోవడం లేదు.నాయకులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దీనిపై ఎంపీడీఓ గారు స్పందించి నీరు వచ్చేట్టుగా చర్యలు తీసుకునే విధిగా సర్పంచ్ కు సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వాలసిందిగా నీటి సమస్య పరిష్కారం చేయాలని దేవీపట్నం మండల జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు కోరుతున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe