గోకవరం సీఎండీ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు..
సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన కంబాల శ్రీనివాసరావు, దంపతులు…
రాష్ట్ర ప్రజలకు కంబాల సంక్రాతి శుభాకాంక్షలు
రంపచోడవరం జనవరి10(ఎల్లో సింగం ప్రతినిధి):
గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్లో శనివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతాపార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాంప్రదాయ పంచెకట్టుతో సతీసామెతంగా కంబాల శ్రీనివాసరావు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. బోగి మంటలు, గంగిరెద్దులకు సారేను సమర్పించడం, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, చిన్నారులకు భోగి పళ్ళు, ధన్యగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, ముగ్గులు, కబడ్డీ, పోటీలు, గాలిపటాలు, బొమ్మల కొలువులు, ఆటల పోటీలు, సంక్రాంతి న్యత్యాలతో సంబరాలు కనుల పండుగా జరిగాయి. సీఎండీ ప్రాంగణాన్ని చక్కటి పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు తీర్చిదిద్దారు. గోకవరంతో, పాటు రంపచోడవరం, రాజానగరం చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి తరలివచ్చారు. పలు పాఠశాల విద్యార్థులు చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, నృత్య, డాన్సులు అందరిని అక్కటుకున్నాయి. భరతనాట్యం విద్యార్థులకు కంబాల శ్రీనివాసరావు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంక్రాంతి ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలని, ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏటా పాడి పంటలు బాగా పండాలని, అన్నదాతలు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. వచ్చే ఏడాది కూడా మరింత ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తామన్నారు. మనం జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. మన సాంస్కృతి సంప్రదాయాలను, ప్రతి ఒక్కరు పాటిస్తూ గౌరవించాలన్నారు. తెలుగు సంప్రదాయానికి ప్రతిక సంక్రాంతి పండుగ అన్నారు. అనంతరం ముగ్గుల పోటిల్లో గెలిపొందిన విజేతలకు కంబాల శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. మొదటి విజేతక ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మెషిన్, రెండోవ విజేతకు గ్రైండర్, మూడవ విజేతకు మిక్సర్ అందజేశారు. అలాగే పది మందికి కన్సల్టేషన్ ప్రైస్ కింద ఒక్కొక్కరికి మిక్సిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, శ్రేయాభిలాషులు, అభిమానులు, ప్రజలు, మహిళలు, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
