*హక్కుల సాధనలో రాజీ పడకూడదు
*తెలుగుయువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ కి బ్రహ్మరధం పట్టిన జనసంద్రం
*గిరిజన ఉపతెగలతో సత్ సంబంధాలు పాటించాలి
*వాల్మీకి జాతి వేడుకతో దద్దరిళ్లిన తూర్పు మన్యం
రంపచోడవరం జనవరి10( ఎల్లో సింగం ప్రతినిధి): ఆదివాసీవాల్మీకి తెగప్రజలు హక్కులు సాధనలో ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని వాల్మీకినేతలు సంఘటితంగా అన్నారు. రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడ గ్రామంలో రాష్ట్ర ఆదివాసీ వాల్మీకి సమ్మేళనం సమావేశం మఠం విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సభా ప్రాంగణానికి విచ్చేసిన నియోజకవర్గతెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ కి వాల్మీకి ఆచారం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వక్తలు రాష్ట్ర జానపద కలల సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య మాట్లాడుతూ ఎల్లపుడు అందరూ ఐక్యముగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ గతంలో వెబ్ సైట్ లో వాల్మీకి తెగను కొందరు కావాలనే తొలగించరాని అలాంటి సమయంలో పాడేరు లో చేసిన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర నాయకులు రామారావు, శెట్టి గంగాధర స్వామి తదితరులు మాట్లాడుతూ మిగిలిన తెగల్లో కలిసి ఉంటున్నట్టే మనం కూడా కలిసిమెలిసి ఉండాలన్నారు. రాజ్యాంగ బద్దంగా మనకు ఉన్న హక్కులు సాధనలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగాలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబురమేష్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గొర్లె సునీత తదితరులు సభను ఉద్దేశించి మాట్లాడారు.
విజయ్ భాస్కర్ కి బ్రహ్మ రధం పట్టిన ఆదివాసీ వాల్మీకులు
రాష్ట్ర ఆదివాసీ వాల్మీకి సమ్మేళనం కార్యక్రమంకి విచ్ఛే సిన నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ కి ఆదివాసీ వాల్మీకి పోలవరం జిల్లా అధ్యక్షులు గొర్లె చిన నారాయణ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. సమ్మేళనం కార్యక్రమానికి కన్వీనర్ గా ఉన్న విజయ్ భాస్కర్ మాట్లాడుతూ అన్ని గిరిజన తెగలతో ఐక్యంగా ఉండాలని కోరారు. అలాగే జాతి అభ్యున్నతికి తన వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అందరూ బాగుండాలని అందులో మనం కూడా ఉండాలన్నారు. కార్యక్రమంలో అతిధులకి ఆయన నేతృత్వంలో జిల్లా ఉద్యోగుల సంఘ అధ్యక్షులు డూలి డేవిడ్ రాజ్, రాష్ట్ర ఆదివాసీ హక్కులు నాయకులు బోండ్ల ప్రసాద్, కింటుకూరి లక్ష్మణరావుల సౌజన్యంలో ఘన సన్మానం చేశారు. అనంతరం కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మారేడుమిల్లి జడ్పీటీసీ బాలాజీ బాబు, బేబీరత్నం,
జుర్రా జాన్ బాబు, ఆదివాసీ నాయకులు మఠం ఆదియ్య, వాసా సత్యనారాయణ, నడిగట్ల రమేష్, అక్కపల్లి పండు, డొక్కులూరి రామారావు, గొర్లె బాబీ, వి.అప్పారావు, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.
