రెవెన్యూ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కోడూరు బాలసుబ్రహ్మణ్యం

తిరుపతి (ఎల్లో సింగం)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ మరియు తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొడూరు బాలసుబ్రహ్మణ్యం, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కొడూరు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తూ, రాష్ట్రాభివృద్ధికి విశేషమైన సేవలు అందిస్తున్న అనగాని సత్యప్రసాద్ మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ జన్మదిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, బి.జి. కృష్ణ యాదవ్, వెంకట పుష్పావతి పాల్గొని మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే తిరుపతి నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమోద్ కుమార్, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ శుభాభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

WhatsApp Join Now
Youtube Subscribe