పట్టాదారు పాస్బుక్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం రెవెన్యూశాఖకు సంబంధించినవేనని అన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అధికారులను హెచ్చరించారు.
భూరికార్డుల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని సీఎం తెలిపారు. పారదర్శకత పెంచడమే లక్ష్యంగా భూరికార్డుల నిర్వహణను డిజిటల్ విధానంలో మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,680 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా పాస్బుక్ల పంపిణీని వేగవంతం చేయాలని, లోపాలు లేకుండా పని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
