పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం

పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం ఓడిపోకుండా ఉండి ఉంటే పోలవరం పనులు 2021లోనే పూర్తయ్యేవని ఆయన అన్నారు. పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని వెల్లడించారు.

రాష్ట్రాల మధ్య గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించామని, అప్పట్లో విమర్శలు ఎదురైనా రైతులకు మేలు జరిగిందని గుర్తు చేశారు.

నీటి వనరుల వినియోగంలో వివాదాలకన్నా సమన్వయమే అవసరమని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe