శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమావేశం,

శ్రీశైలం, జనవరి 9: శ్రీశైలం
( ఎల్లో సింగం ప్రతినిధి )

దేవస్థానం అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ శుక్రవారం 09-01-2026 జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం, దోర్నాల, ఆత్మకూరు డిఎఫ్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో ఉత్సవాల సాంకేతిక, భద్రతా, సౌకర్య వ్యవస్థలపై వివరణాత్మక చర్చ జరిగింది. భక్తుల అవసరాలకు తగ్గట్ట అన్న ప్రసాదం, రవాణా, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై సూచనలు జారీ చేశారు,

WhatsApp Join Now
Youtube Subscribe