- చెర్లోపల్లిలో వేడుక.. చిట్వేలులో ఆకలి తీర్చిన వైనం
- చందు చొరవను అభినందించిన స్థానికులు
చిట్వేలు, జనవరి 09: ఎల్లో సింగం ప్రతినిధి
ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న వారికి అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు చెర్లోపల్లికి చెందిన చందు. వివరాల్లోకి వెళ్తే.. చెర్లోపల్లిలోని న్యూ గంగయ్య ఇంట్లో శుక్రవారం ఒక వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు కొంతమేర మిగిలాయి.
-సమయస్ఫూర్తితో అన్నదానం
సాధారణంగా ఫంక్షన్లలో భోజనాలు మిగిలితే పారవేస్తుంటారు, కానీ గంగయ్య బామ్మర్ది చందు అలా చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మిగిలిన భోజనాన్ని తన ఆటోలో చిట్వేలుకు తీసుకువచ్చారు. మొదట కుమ్మర వీధిలో ఉన్న సుమారు 20 మంది నిరుపేదలకు భోజనాలు పంపిణీ చేశారు.అనంతరం చిట్వేల్ హెల్ప్‌లైన్ సొసైటీ ఫుడ్ స్టోరేజ్ కేంద్రం వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న మరో 20 మందికి ఆహారాన్ని అందజేశారు. ఇలా మొత్తం 40 మంది పేదల ఆకలిని తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. భోజనాన్ని వృధా చేయకుండా పేదలకు పంచిన చందును
