కోనరాజుపల్లిలో లభ్యమైన విగ్రహాలను దర్శించుకున్న బత్యాల చంగల్ రాయుడు

​ఒంటిమిట్ట,జనవరి 08,(ఎల్లో సింగం ప్రతినిధి)

ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లి పంచాయతీ హరిజనవాడలో ఇటీవల ఒక పుట్టలో లభ్యమైన పంచముఖ ఆంజనేయస్వామి, నరసింహస్వామి,లక్ష్మీదేవి విగ్రహాలను మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు సందర్శించారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నం కిరణ్ స్వామి ఆహ్వానం మేరకు గురువారం ఆయన విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా బత్యాల చంగల్ రాయుడు మాట్లాడుతూ, గ్రామంలో పురాతన విగ్రహాలు లభ్యం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన స్థానిక గ్రామస్తులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe