సింగరేణిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కొరకు వివిధ పాఠశాలల పిఈటి లతో పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం
కొత్తగూడెం : సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యం లో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు తేదీ 26.01.2026 న నిర్వహించే 77 వ గణతంత్ర దినోత్సవ సెంట్రల్ ఫంక్షన్ వేడుకల లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పై కొత్తగూడెం నందు గల వివిధ పాఠశాలల మరియు కళాశాలల నుండి వచ్చిన పిఈటి లతో డిజిఎం(పర్సనల్) లు బి.శివకేశవ రావు, ముకుంద సత్యనారాయణ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ రోజు తేదీ: 07.01.2026 బుధవారమున సింగరేణి ప్రధాన కార్యాలయము నందు సమీక్షించారు.ఈ సంధర్భముగా వారు పాఠశాలల మరియు కళాశాలల నుండి వచ్చిన పిఈటి లతో 77 వ గణతంత్ర దినోత్సవ సెంట్రల్ వేడుకల లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎవరెవరు ఏమేమి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారో, ఎంత మంది విద్యార్ధులు పాల్గొంటారో వివరముగా అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క వేడుకలలో మన సంప్రదాయాలు ఉట్టి పడేలా ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం లో సహాయ పడాలని అన్నారు. ఈ కార్యక్రమములో బి.శివకేశవ రావు, ముకుంద సత్యనారాయణ, డివై.పిఎం కే.శివకుమార్, సీనియర్ పిఓ ఎం.శ్రీనివాస్ కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, వెల్ఫేర్ పిఏ వర ప్రసాద్, బిఎస్జి కొ ఆర్డినేటర్ పి.సాయి నిరంజన్, సీనియర్ రోవర్ స్కౌట్ లీడర్లు వి.వెంకట స్వామి, ఎల్.గోపాల కృష్ణయ్య మరియు పాఠశాలల మరియు కళాశాలల నుండి వచ్చిన పిఈటి లు పాల్గొన్నారు.
