దేవాడ గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోళ్ల,
శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి జనవరి 7:- శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేవాడ గ్రామంలో రైతులకు సురక్షితమైన భూమి యాజమాన్యాల హక్కు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పంపిణీ చేశారు
కొత్తవలస మండలం దేవాడ రెవెన్యూ పరిధిలో రైతులకు సురక్షితమైన యాజమాన్యాల హక్కుల పాస్ పుస్తకాలను ఇంచార్జ్ తాసిల్దార్ సునీత ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శృంగవరపుకోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ
కొత్తవలస రెవెన్యూ కార్యాలయం పరిధిలో ఉన్న రైతులకు 12,269 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు దేవాడ రెవెన్యూలో రైతులకు 1009 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోందని
మీ భూమి – మీ హక్కు” (మీ భూమి మీ హక్కు) అనే భావనతో, ప్రభుత్వ రాజముద్ర (అధికారిక ముద్ర)తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమం సాధారణంగా భూమి రికార్డులు మరియు హక్కులకు సంబంధించిన ప్రభుత్వ ఉపక్రమంలో భాగం “పట్టాదారు పాస్ పుస్తకం” అనేది భూమి యాజమాన్యాన్ని రుజువు చేసే ఒక ముఖ్యమైన శాశ్వత డాక్యుమెంట్. ప్రభుత్వ ముద్రతో కూడిన ఈ పుస్తకాలను భూమి యజమానులకు పంపిణీ చేయడం వలన:
- భూమి హక్కుల భద్రత: రైతులు మరియు భూమి యజమానుల హక్కులు సురక్షితం చేయబడతాయి.
- పారదర్శకత: భూమి రికార్డులు అధికారికం మరియు స్పష్టంగా ఉంటాయి.
- చట్టబద్ధత: భూమి లెక్కలు నవీకరించబడి, వ్యతిరేక దావాల నుండి రక్షణ లభిస్తుంది.
- ప్రభుత్వ ఉపక్రమాల ప్రాతినిధ్యం: శాసనసభ్యులు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన, ప్రభుత్వం యొక్క జనాభా-స్నేహపూర్వక కార్యక్రమాలకు మద్దతు మరియు దృశ్యమానత లభిస్తుంది. నియోజకవర్గంలోని ప్రజల భూమి హక్కుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మరియు ప్రభుత్వ సేవలను వారి వద్దకు తీసుకువెళుతున్నట్లు సందేశం వెలువడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కోళ్ల వెంకటరమణ (శ్రీను),ప్రధాన కార్యదర్శి కనకాల శివ,ఉపాధ్యక్షులు యల్లపు సూరిబాబు,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చినరాము,లెంక శ్రీను, మాజీ సర్పంచ్ కోరుపోలు అప్పారావు,బీసీ అయ్యారక సమితి కన్వీనర్ బంగారు రమేష్,బూత్ ఇంచార్జ్ కోళ్ల సాయి కిషోర్, గొంప దుర్గా ఉమేష్, తెలుగు యువత కోరుబిల్లి ఉపేంద్ర, కర్రీ చిన్నా, రమేష్,ముమ్మన పవన్ కుమార్, గంతకుర సత్యనారాయణ,సానభాని రమణ, కనకరావు మరియు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
