శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి
ఒక్క శ్రీనగర్ కాలనీలో రూ.2కోట్లతో సీసీ రోడ్లు వేశామన్న ఎమ్మెల్యే
గత ఐదేళ్లలో ఒక్క కిలోమీటర్ సీసీ రోడ్డు కూడా వేయలేదన్న దగ్గుపాటి
మెడికల్ కళాశాలు, విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రుద్రంపేట పంచాయతీలోని శ్రీనగర్ కాలనీలో 47లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 18నెలల కాలంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేస్తున్నామన్నారు. ఒక్క శ్రీనగర్ కాలనీలో రూ.2కోట్లతో సీసీ రోడ్లు వేశామన్నారు. అర్బన్ నియోజకవర్గంలోని 4పంచాయతీల్లో రూ.4కోట్లతో రోడ్లు వేశామన్నారు. మరో రూ.25కోట్ల డ్రైనేజీలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో నగరంలో ఒక్క కిలోమీటర్ సీసీ రోడ్డు కూడా వేయలేదని విమర్శలు చేశారు. డంపింగ్ యార్డును క్లియర్ చేయడంతో పాటు రోడ్లను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి రానా తెలిపారు. నగరంలో 130కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణం కాకుండా అడ్డుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి పోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని మళ్లీ గాడిలో పెట్టడమే కాకుండా 18నెలల కాలంలో రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నది ఒక్క ఏపీలోనన్నారు. రూ. 4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం పడకుండా ముఖ్యమంత్రి చేశారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి హిదయతుల్లా, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, టిడిపి జిల్లా కార్యదర్శి కొనంకి గంగారామ్, కార్పొరేటర్ బాలాంజనేయులు, డైరెక్టర్లు పరమేశ్వర్, కడియాల కొండన్న, టిడిపి నాయకులు నెట్టెం బాలకృష్ణ, కాయగూరల శ్రీధర్, సాయిరామయ్య చౌదరి, గోళ్ళ సుధాకర్ నాయుడు, కేశవ నాయుడు, తొండపునాటి రమేష్, గోపాల్ గౌడ్, చేపల హరి భక్తవత్సలం నాయుడు, బోయపాటి బాలప్ప, కదిరప్ప, మల్లెల దుర్గేష్, ఈడిగ నాగభూషణం, వడ్డే భవాని, దాడి మల్లికార్జున, సికిందర్, రాజేష్, బోయ పోతులయ్య, శ్రీనివాస్ గౌడ్, సుభాష్ చంద్రబోస్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
