బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
రాష్ట్ర వ్యవసాయ,పశుసంవర్ధక శాఖ మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంగళవారం మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తో ఎమ్మెల్యే బేబి నాయన మాట్లాడుతూ బొబ్బిలి ఏఎంసీ సముదాయాలు నందు నూతన గోడౌన్ లు, కాంపౌండ్ వాల్ మరియు కమర్షియల్ షాపు ల నిర్మాణం గురించి మంత్రి అచ్చెన్నాయు డు దృష్టికి తీసుకువెళ్లారు.అలాగే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న వెటర్నరీ ఆసు పత్రుల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని ఎమ్మెల్యే బేబినాయన మంత్రి అచ్చెన్న కు తెలియజేశారు.ముఖ్యంగా తెర్లాం మండ లం నెమలాం గ్రామంలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందని, వీలైనంత త్వరగా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బేబినాయన వినతిపత్రా న్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకట నాయుడు, తెర్లాం మండలం టీడీపీ అధ్యక్షు లు నర్సుపల్లి వెంకటేష్ ,టీడీపీ నాయకులు రెడ్డి శంకరరావు , యుగంధర్ , తదితరులు ఉన్నారు…
