పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు
బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
రోజు రోజుకు బలహీన పడుతున్న తెలుగు భాషా, సంస్కృతి, వారసత్వాన్ని సంరక్షిం చుకోవలసిన భాద్యత మనందరిపై ఉందని బొబ్బిలి పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అన్నారు. సోమవారం రాత్రి కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జె సి రాజు ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభ లు ముగింపు వేడుకల నేపథ్యంలో బొబ్బిలి మండలం,పట్టణ పాఠశాలల్లో తెలుగుభాష బోధించే ఉపాధ్యాయులను సత్కరించే కా ర్యక్రమాన్ని స్థానిక ఎన్జీఓ హోంలో సిహెచ్ జె ప్రవీణ్ ,ఎన్ రమేష్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అధితిగా పాల్గొన్న పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు మాట్లాడుతూ భాష సంరక్షణ కుటుంభం నుండే ప్రారంభం కావాలన్నారు.ఆంగ్లభాషా వ్యామోహంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు.ప్రత్యేక అధితిగా పాల్గొ న్న కవి, రచయిత, దాలి నాయుడు మాట్లా డుతూ తెలుగు భాష వినియోగం విస్తృతం అయినప్పుడే భాష బ్రతుకుతుందన్నారు. కవులు,రచయితలు,సాహితీవేత్తలు,సాహి త్యాభిలాషులు కృషి ద్వారా తెలుగు భాష బ్రతుకుందన్నారు.కారుణ్య చైర్మన్ జె సి రా జు మాట్లాడుతూ తెలుగు ప్రపంచ మహాస భల ముగింపు సమయంలో ఆ వారసత్వా న్ని కొనసాగిస్తూ ఒక వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషా బోధకులను సత్కరించుకోవ టం చిరస్మరణీయంగా మిగిలి పోతుందన్నా రు.తెలుగు భాషా,సంప్రదాయాలు, సంస్కృ తి,వారసత్వ పరిరక్షకులు,వారసులు తెలు గు భాషా భోదకులేనని ఆయన అన్నారు. అనంతరం కోమటిపల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవతం కళాకారుడు బొంతలకో టి శంకరరావు కి గౌరవ డాక్టరేట్ అందుకు న్నందుకు గాను అలాగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర శ్రీ పూర్ణకుంభం పురస్కా రాన్ని అందుకున్న నేపథ్యంలో కారుణ్య సం స్థ సభ్యులు,అధితులు బొంతలకోటి దంప తులను ఘనంగా సత్కరించి నూతన వ స్త్రాలను బహుకరించారు.అనంతరం వివిధ పాఠశాలల నుండి హాజరైన 22 మంది తెలు గు భాషా బోధానోపాధ్యాయులను దుస్సా లువాలతో సత్కరించి జ్ఞాపికలను అంద జేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కాలేజీ ప్రధానాచార్యులు,తెలుగుభాషా బోధ నాచార్యులు డాక్టర్ బొంతు శ్రీరాములు, ఎ న్జీఓ బొబ్బిలి యూనిట్ అధ్యక్షులు బలరాం నాయుడు,కార్యదర్శి చుక్క శ్రీను,కారుణ్య ప్రతినిధులు నాగూరు రమేష్ ,జి హెచ్ జి శర్మ ,కె రామకృష్ణ,అర్ ఎన్ రాజు, సోమేశ్వ రరావు, కృష్ణ మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
