పొట్టేపాలెం బ్రిడ్జి తో లక్షల మందికి లబ్ది

  • ప్రజల మనిషి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • ఒకే వేదికపై అన్ని పార్టీల నాయకులను తీసుకురావడం గొప్ప విషయం
  • విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
  • రహదారి ప్రమాదాలకు ఇక చెల్లుచీటి

పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో లక్షలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవలో ఉన్నారన్నారు. అనుకున్నది సాధించే తత్వం కోటంరెడ్డికే సాధ్యమని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నగర ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పముజుల దశరథ రామయ్య, సిపిఎం నాయకులు అరిగెల నాగేంద్ర సాయి, జనార్దన్, జనసేన నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి పొట్టేపాలెం కలుజువద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు వేమిరెడ్డి దంపతులకు రూరల్ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు, భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పొట్టేపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం.. 25-30 ఏళ్ల కల అని, ఇన్నాళ్లకు అది సాధ్యమయిందన్నారు. గతంలో తనకు ఈ ప్రాంతంలో మైనింగ్‌ ఉండేదని, రహదారి ఇబ్బందుల వల్లే వదిలేశానన్నారు. ఇన్నాళ్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇది సాధించారన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. అభివృద్ధికి నిధులు మాత్రం అందిస్తున్నారని చెప్పారు. ఒక్క పెన్షన్ల వరకే ఇప్పటివరకు 50 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. 9 కోట్ల విలువైన బ్రిడ్జిని తగ్గించి.. పొట్టేపాలెం బ్రిడ్జి మంజూరు చేశారన్నారు. అది శ్రీధర్‌రెడ్డి పట్టుదలకు నిదర్శనమని చెప్పారు. ఎంతో పట్టుదల, ప్రజల పట్ల ప్రేమ ఉండబట్టే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం రూరల్‌ ప్రజల అదృష్టమన్నారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి కూడా ఎంతో కష్టపడుతున్నారని, ప్రజల మనసు తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాలిటిక్స్‌ అంటే ప్యాషన్‌ అని, అందుకే నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ వారి సంక్షేమానికి పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సూచనల మేరకు తప్పకుండా కొండాయపాలెం, బివి నగర్‌ ప్రాంతాల్లో రైల్వే అండర్ పాసుల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరిని కలవాలన్నా కలుస్తామని ఆయన చెప్పారు. పొట్టేపాలెం బ్రిడ్జిని 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. వైద్యం నిమిత్తం కేరళ వెళుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాట ఫలితమేనన్నారు. అసెంబ్లీలో పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జ్ నిర్మాణ సమస్యను లేవనెత్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నిధులు సాధించారన్నారు. పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీలను మద్దతు కూడగట్టడం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కే సాధ్యమయిందన్నారు. కలుజుపై బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు రూరల్ పరిధిలోని గ్రామాలకే కాక కోవూరు నియోజకవర్గంలోని జొన్నవాడ, మినగల్లు, పెనుబల్లి గ్రామవాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జొన్నవాడ ఆలయానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యమని చెప్పారు.

ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో యువజన నాయకుడిగా ఉండి 30 సంవత్సరాల తరువాత ఎమ్మెల్యే అయినటువంటి ఒకేఒక్క యువజన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి తామంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి హామీని నెరవేర్చారన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండటం తనకు ఇష్టమని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోననీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టిడిపి నాయకులు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, గునుగుల కిషోర్, క్లస్టర్, కో క్లస్టర్ ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షలు, కార్పొరేటర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe