బాడంగి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ..

బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో గల బాడం గి మండల ఎంపీపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.గత ప్రభుత్వ హాయాంలో వైసీపీ వారు మోసపూరితంగా సాధించిన ఎంపీపీ స్థానాన్ని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఎమ్మెల్యే బేబినాయన నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు వైసీపీ నాయకు లు సైతం టీడీపీకి మద్దతు ఇచ్చి, ఎంపీపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి దక్కేలా చేశారు.స్థానిక ఎమ్మెల్యే బేబినాయన
,బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ల ఆధ్వర్యంలో సోమవారం బాడంగి మండల కార్యాలయం లో ప్రస్తుత ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మా నం నెగ్గి, 9 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీగా యజ్జల లక్ష్మి , వైస్-ఎంపీపీగా పాలవలస గౌరు ను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర రావు, బాడంగి మండలం టీడీపీ అధ్యక్షులు తెంటు రవి, మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ, సింగిరెడ్డి భాస్కరరావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయ ణ,పలు గ్రామాల సర్పంచులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe