భక్తి శ్రద్ధలతో లక్ష తులసి పూజలో పాల్గొన్న విక్కుర్తి.

ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వరస్వామి వారి ఆలయంలో నిర్వహించిన లక్ష తులసి పూజా కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

శ్రీకాకుళేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష తులసి పూజ, కుంకుమార్చన 37వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆలయ అర్చకులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత అగ్నిహోత్రం భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఆదివారం నిర్వహించిన లక్ష తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో విక్కుర్తి కుటుంబ సమేతంగా పాల్గొని, పండితుల వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. గ్రామానికి చెందిన మహిళా భక్తులు పెద ఎత్తున పాల్గొని, పూజా కార్యక్రమాలను తిలకించారు.

అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్న సమారాధనను విక్కుర్తి శ్రీనివాస్ ప్రారంభించగా, పలువురు భక్తులు పాల్గొని, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

37వ వార్షిక ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భాగంగా శనివారం శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకు పాలాభిషేకం అలాగే రాత్రికి చందన అలంకారాలు నిర్వహించిన విషయం విధితమే.

ఆయా కార్యక్రమాలలో విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీను, భూపతి నాంచారయ్య, బర్మా బుజ్జి,స్థానిక ప్రముఖులు పోతన ఆంజనేయులు, పోతన కాకులేశ్వరరావు, పోతన రాధాకృష్ణ, పోతన రవి, అంబటి నాగరాజు, కొండవీటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe