మన్యంలో చిన జీయర్ స్వామి పర్యటన

త్రిదండి చిన జీయర్ స్వామి మన్యం జిల్లా సీతంపేట మండలం సీదీ గ్రామంలో శనివారం మారుమూల గిరిజన ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేసి గిరిజనులకు ఆశీస్సులు అందించారు. దేవాలయ కమిటీ చైర్మన్ గేదెల జనార్ధన రావు ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ వారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ గిరిజనుల మనస్సు , ఆప్యాయత ,అనురాగాలు జీవన విధానం అద్భుతమని అందుకే దైవం కూడా కొండలపై వెలసిన సింహాచలం అప్పన్న స్వామి, శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, భద్రాచలం రామన్న వెలిశారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం ఎంతో సంతోషం అనిపించిందని ఆయన అన్నారు. యువత భక్తి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన వారు తమ దేవాలయంలో విధిగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు..

WhatsApp Join Now
Youtube Subscribe