టంగుటూరులో వైభవంగా ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమం
నూతనంగా నిర్మించిన ‘గోకులం షెడ్డు’ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చల్లమల్ల రమేష్ బాబు పిలుపు మేరకు గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును మేడా విజయ్ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించి, పర్యావరణ హితమైన ‘గ్రీన్ మొమెంటో’ను అందజేశారు.
ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ
గత ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తిరిగి ప్రాణం పోశారని, నేడు సర్పంచ్‌లు సగర్వంగా నిలబడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం దారి మళ్లించిన వేల కోట్ల నిధులను నేడు నేరుగా పంచాయతీలకే కేటాయించి, గ్రామాలను అభివృద్ధి బాట పట్టించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
పాడి రైతుల కష్టాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర మౌలిక వసతులతో పల్లెల ముఖచిత్రం మారుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైనుద్దీన్, ఎంపిటిసి భువనబోయిన పెంచలయ్య, మాజీ ఎంపీటీసీ అక్బర్ ఖాన్, టీడీపీ మహిళా నాయకురాలు షేక్ షర్మిల, తోటా కృష్ణయ్య, సీనియర్ నాయకులు గుజ్జల ఈశ్వరయ్య, చుక్క వెంకటేశ్వరయ్య, మినగ నాగభూషణం, మినగ నాగార్జున, చలమాల రమేష్ బాబు, బండోతు నరసింహులు, చలమల రామయ్య, అల్లాబక్ష్, వెంకటసుబ్బయ్య, షేక్ గౌస్ పీర్, షేక్ ఖాదర్ భాషా మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
