టూరిజం హబ్ గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయం…

డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

కయాకింగ్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాలను అభినందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

జనవరి 11,12,13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీవో పి శ్రీకర్,ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు లతో కల్సి పాల్గొన్నారు. పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తీసుకువచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యామన్నారు.కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డిఓ పి శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బొబ్బర్లంక నుంచి లొల్ల లాకుల వరకూ రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కెనాల్ లో వాటర్ స్పోర్ట్స్ ని, డ్రాగన్ పడవల పోటీలను ఏర్పాటుచేసి భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయని తెలిపారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని కోరారు

WhatsApp Join Now
Youtube Subscribe