శివరాంపురం గ్రామంలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో పట్టాదారు పుస్తకాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల మీద హక్కులు బలపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేసిందన్నారు.లబ్ధిదారుల సమస్యల ను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి సూచ నలు చేసినట్లు ఆమె తెలిపారు.జిల్లాలో మొత్తం 76,752 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
పార్వతీపురం నియోజకవర్గం – 22,1977 పట్టాదారు పాస్ పుస్తకాలు

సాలూరు నియోజకవర్గం – 14,056 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.

కురుపాం నియోజకవర్గం – 16,399 పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

పాలకొండ నియోజకవర్గం – 24,100 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలపై తమ నాయకుడి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకు న్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలి పారు. ప్రజల హక్కుల పత్రాలపై రాజకీయ ముద్ర వేయడం తగదని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజ ముద్ర మాత్రమే ఉంటుందని మంత్రి గుమ్మ డి సంధ్యారాణి తెలిపారు.పుస్తకంలో లబ్ధి దారుల భూమి వివరాలు సులభంగా తెలు సుకోడానికి QR కోడ్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు..

WhatsApp Join Now
Youtube Subscribe