సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర…

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర...

పార్వతీపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. శుక్రవారం ఉదయం రిబ్బన్ కత్తిరించి నూతన సంస్థను ప్రారంభించారు.ఈ సం దర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేవలం వ్యాపార పరంగానే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సీ ఎస్ ఆర్ నిధులతో ఆ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు పార్వతీపురంలో పలు కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారని చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రాలు నాణ్యతగాను సరసమైన ధరల్లోను లభిస్తాయని ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వంటి పెద్ద సంస్థలు పార్వతీపురం రావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. అనం తరం ఎమ్మెల్యే విజయ్ చంద్రను స్థానిక టీడీపీ కౌన్సిలర్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అరుకు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe