స్టాక్ మార్కెట్ దిగ్గజం, ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం ప్రకటించారు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో పదవి నుంచి నేడు వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఆయన స్థానంలో గ్రెగొరి ఎబెల్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
95 ఏళ్ల వారెన్ బఫెట్ 1965లో బెర్క్‌షైర్ హాత్‌వే పగ్గాలు చేపట్టి, దాదాపు 60 ఏళ్ల పాటు సీఈవోగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో బెర్క్‌షైర్ హాత్‌వే ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
ఈ నిర్ణయం పెట్టుబడి ప్రపంచంలో ఒక చారిత్రక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
