SUPER SIX Yellow Singam Exclusive :-ఎల్లో సింగం టాప్ న్యూస్

1️⃣ ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై తుది నోటిఫికేషన్ విడుదల
మార్కాపురం, పోలవరం జిల్లాలు సహా కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు. రేపటి నుంచే అమల్లోకి రానున్న మార్పులు.

2️⃣ ఏపీపీఎస్సీ గ్రూప్–2పై హైకోర్టు కీలక తీర్పు
రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత. 2023 గ్రూప్–2 నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు.

3️⃣ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా
తిరుమల సహా ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవారిని దర్శించుకున్న భక్తజనం.

4️⃣ కడపలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న 9 మంది నిందితుల అరెస్టు. రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం.

5️⃣ అసోంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
11 మంది ఉగ్రవాదుల అరెస్ట్. అసోం, త్రిపురలో ఉగ్ర కార్యకలాపాలు గుర్తించిన సిట్.

6️⃣ ఢిల్లీకి ‘సుదర్శన చక్ర’ రక్షణ కవచం
రూ.5,181 కోట్లతో దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

WhatsApp Join Now
Youtube Subscribe