ఈ నెల 30న రూ.4,000 కోట్ల రుణ సమీకరణ చేయనున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కోట్ల రుణం సమీకరించేందుకు ఈ నెల 30న రిజర్వ్‌బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొననుంది. ఈ రుణాన్ని రూ.1,000 కోట్ల చొప్పున నాలుగు విడతల్లో తీసుకోనున్నారు. అవి 9, 10, 12 మరియు 17 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణానికి వర్తించే వడ్డీ రేటు డిసెంబర్ 30న ఖరారవుతుంది.

WhatsApp Join Now
Youtube Subscribe