వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తామని, ఈ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. VGF కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30 శాతం చొప్పున ఆర్థిక సాయం అందించనున్నాయని వెల్లడించారు.

ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆదోని వైద్యకళాశాల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యం పేదలకు అందుబాటులో ఉండేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించడమేనని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe