జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్’ కు సంబంధించిన కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఈ గ్రామసభల్లో
- కొత్త చట్టంలోని కీలక నిబంధనలు,
- శ్రామికులకు లభించే చట్టబద్ధ హక్కులు,
- ఉపాధి, జీవనోపాధి అవకాశాలపై
శ్రామికులు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి చర్చించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు, లబ్ధిదారులు గ్రామసభల్లో పాల్గొని కొత్త చట్టంపై పూర్తి సమాచారం తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
