వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలను సజావుగా నిర్వహించేందుకు గత రెండు నెలలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రుల సబ్ కమిటీతో కలిసి నిరంతర సమీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.
టికెట్లు లేదా టోకెన్లు లేనివారికి తిరుమలకు అనుమతి ఉండదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలకు భక్తుల ప్రవేశాన్ని నిరాకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
మొదటి మూడు రోజుల పాటు టోకెన్లు కలిగిన భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని, జనవరి 2 నుంచి 7 వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కోరారు
