AP Govt: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2025–30ను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 26న ఐటీ శాఖ విడుదల చేసింది.

ఎర్లీ బర్డ్ పథకం కింద రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టే తొలి పది కంపెనీలకు రెండు విడతల్లో 50 శాతం పెట్టుబడి రాయితీ అందించనున్నారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అందించే క్యాపిటల్ సబ్సిడీని లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని ఐటీ శాఖ తెలిపింది.

అదనంగా, ఫ్యాక్టరీ భవనాల అద్దెలో మూడేళ్లపాటు 50 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. విద్యుత్ డ్యూటీని ఆరేళ్లపాటు పూర్తిగా మాఫీ చేస్తారు. అలాగే రూ.1,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే సంస్థలకు పాలసీ ప్రకారం ఐదేళ్లపాటు టైలర్‌మేడ్ విధానంలో ప్రత్యేక సబ్సిడీలు అందించనున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe