విమాన టికెట్‌ ఛార్జీలను నియంత్రిస్తామంటూ కేంద్రం భరోసా..!

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ను మరింత బలోపేతం చేస్తామని, ముఖ్యమైన సందర్భాల్లో విమాన టికెట్‌ ఛార్జీలను అనవసరంగా పెంచడం సరికాదని స్పష్టం చేశారు.

అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విమాన టికెట్‌ ధరలు అధికంగా ఉన్నట్లు ప్రయాణికులు భావిస్తే, వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ప్రభుత్వానికి పంపవచ్చని సూచించారు.

అలాగే అంతర్జాతీయ విమాన రూట్లలోని టికెట్‌ రేట్లను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe