18న మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

భక్తుల సౌకర్యార్థం 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
▪️22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు, సాలకట్ల వసం తోత్సవాల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్ లైన్లో విడుదల చేయనుంది.
▪️23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
▪️ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరు మల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు. భక్తులు *https://ttdevasthanams.ap.gov.in* 3 బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe