ఎల్లో సింగం న్యూస్ హోళగుంద జనవరి 16
హోరాహోరీగా క్రికెట్ కబడ్డీ పోటీలు జరిగాయని వివిఆర్ ఆర్గనైజర్లు తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హొళగుంద మండలం హెబ్బటం గ్రామం నందు వి వి ఆర్ టీమ్ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా, కబడ్డీ&క్రికెట్ నిర్వహించడం మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో జరిగిందన్నారు కబడ్డీ క్రికెట్ పోటీల్లో ఫైనల్ టోర్నమెంట్ లు ఉత్సాహభరితంగా కొనసాగాయి. జట్ల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది ఈ పోటీల్లో ప్రతిభావంతమైన కబడ్డీ జట్లు& క్రికెట్ జట్లు పరస్పరం నువ్వా నేనా అనే రీతిలో తలపడుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. గెలుపే లక్ష్యంగా క్రీడాకారులు అద్భుతమైన రైడ్లు, సమయోచిత టాకిల్స్తో, ఫోర్ లు, సిక్స్ లతో తమ ప్రతిభను చాటారు. మ్యాచ్ చివరి నిమిషం వరకూ ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను కట్టిపడేసింది.
అలాగే గెలుపొందిన జట్లు కు కబ్బడి టీమ్ కు మొదటి బహుమతి 8000/-రెండవ బహుమతి 5000/- లును అలాగే క్రికెట్ టీమ్ ఇరు జట్టులకు క్రికెట్ కిట్లు ను విన్నర్, రన్నర్ టీమ్ లకు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం లో మండల కోశాధికారి వీరసేన రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోపాల్,ఉప సర్పంచ్ సవారప్ప, క్లస్టర్ 1 ఇంచార్జ్ మల్లికార్జున, గ్రామ ఉపాధ్యక్షులు నాగయ్య,బూత్ కన్వీనర్ లు శేక్షవాలి, బీజేపీ కాళప్ప,పిన్ని కృష్ణ,మాణిక్య, కుమ్మరి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు
