“హెరిటేజ్ ఫుడ్స్‌పై ఆరోపణలు సరికావు: ఢిల్లీ హైకోర్టు ఫేక్ ప్రచారం గుర్తించింది – బొల్లినేని వెంకట రామారావు”

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా మరియు వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. కొండాపురం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా హెరిటేజ్ ఫుడ్స్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిందని తెలిపారు. కేసును విచారించిన కోర్టు సంబంధిత ప్రచారాన్ని ఫేక్ ప్రచారం గా గుర్తించిందని, దీనికి సంబంధించిన వార్తలు మరియు సోషల్ మీడియా పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆధారాలు లేకుండా ఒక ప్రముఖ సంస్థపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడం బాధాకరమని విమర్శించారు. హెరిటేజ్ ఫుడ్స్ వంటి సంస్థలు రైతులతో అనుసంధానంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాయని, వాటిపై రాజకీయ ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe